స్టేట్ న్యూస్ తెలుగు, 01 జులై (భద్రాచలం )
ఎటపాక మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎటపాక మండల తాసిల్దారుని, జడ్పిటిసి ఉబ్బ సుష్మిత, ఎంపీపీ కాక కామేశ్వరి, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు ఆకుల వెంకట రామారావు( పెద్దోడు), గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి ని కలిసి రాబోయే వరదల సమస్య లపై బఫర్ స్టాక్ మరియు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. అలాగే ముంపు గురి అయ్యే గ్రామాలను గుర్తించి చుట్టూ నీళ్లు వచ్చిన గ్రామాల వరద బాధితుల ప్రజలకు కూడా సహాయం చేయాలని మరియు పశువుల దానా ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దామర్ల రేవతి, కాకా వెంకట్, శీలం నాగేశ్వరరావు, తోట శివకుమార్, ఆకుల దయాకర్, కోడూరు నవీన్ కుమార్, చల్లమని కొరకాసుల సూర్యప్రకాశరావు మర్మం రాంబాబు, మాటూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.