స్టేట్ న్యూస్ తెలుగు: 08 మే(హైద్రాబాద్):
గురువారం అచ్చంపేట టౌన్ అంబేద్కర్ చౌరస్తా లో , ఐ ఎన్ టి యూ సి జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి , అచ్చంపేట ఎమ్మెల్యే డా వంశీ కృష్ణ ఆదేశాల మేరకు ఉగ్రవాదాన్ని తుది ముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ ఆపరేషన్ సింధూర్ ను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఐ ఎన్ టీ యూ సి ఆధ్వర్యంలో ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ యోమిక సింగ్ చిత్ర పటాలు, జాతీయ జెండా లతో వేడుకలు నిర్వహించారు ,
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ కు అర్థమైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద అంతానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడనున్నాయి అని తెలిపారు.ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ కు,భారత సైన్యానికి, అభినందనలు తెలియజేసారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం,ఐ ఎన్ టీ యూ సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ,ఐ ఎన్ టీ యూ సి అచ్చంపేట టౌన్ అధ్యక్షులు ఎండీ గౌస్ పాష , బల్మూర్ మండలం అధ్యక్షులు చందు నాయక్, ఉపాధ్యక్షులు మౌలానా, రాజు, స్వామి గౌడ్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ నీలం శేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండూరు శేఖర్, గణేష్,లాలు నాయక్ ,చందర్,తాలూకా సహాయ కార్యదర్శి ఉస్మాన్, తాలూకా సెక్రెటరీ వెంకటేష్,అన్వర్ పాషా,అజ్జు, చాన్ పాషా శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.