Saturday, January 18, 2025

రైతు ఉత్పత్తిదారుల సంఘం తృతీయ మహా జన సభ

స్టేట్ న్యూస్ తెలుగు,24 సెప్టెంబర్(నిజామాబాద్)

నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని సిరికొండ మండలం లో నాబార్డ్ సహకారంతో నాబ్కాన్స్ ఆధ్వర్యంలో ఎం. ఎన్. కన్వెన్షన్ హాల్లో రైతు చైతన్య రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తృతీయ మహాజనసభ నిర్వహించారు. ఈ మహాసభకు నాబ్కాన్స్ కోఆర్డినేటర్ థామస్ మోడీ  ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ., రైతులం అంత ఏకమవుదాం మన పంటలతో మనమే వ్యాపారం చేసుకుందామని వారు అన్నారు. సంఘం యొక్క ఉద్దేశం ఇదే అని అన్నారు. రైతు ఉత్పత్తిదారులసంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ., ఒక్కరి కోసం అందరం అందరికి కోసం ఒకరం అని రైతులంతా ఏకతాటిపై వచ్చి నిర్మించుకున్న సంఘాన్ని నిలబెట్టుకోవాలనీ వారన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య మాట్లాడుతూ., రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కి తాన సహయ సహకారాలు అన్ని వేళలా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా తృతీయ మహాసభ కోల్డ్ ప్లస్ ఆయిల్ మరియు డ్రోన్ వంటి వసతులను రైతులకు ఉత్పత్తి చేసే విధంగా తీర్మానించిందని అన్నారు. సమాజంలో కల్తీనూనె పెరిగి ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి అని అన్నారు. అలాంటివి జరగకుండా రైతులే స్వయంగా కోల్డ్ ప్లస్ ఆయిల్ నిర్మించుకొని తద్వారా ఆయిల్ తయారు చేసుకునీ స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం పాటు పడాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొనదెల శ్రీనివాస్. వైస్ చైర్మన్ తీనేటి నరేష్. నబ్కాన్స్ కోఆర్డినేటర్ థామస్ మోడీ(ఉమ్మడి జిల్లాల)డైరెక్టర్లు ఎం నరేందర్ ,బాదావత్ తిరుమల, కారల్ మార్క్స్, రీక్క బాబురావు,మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్,సీఈవో రవిశంకర్ సిబ్బంది సుకన్య రాకేష్. అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular