స్టేట్ న్యూస్ తెలుగు,09 అక్టోబర్ (ఖమ్మం)
అక్టోబర్ 3 నుండి 6 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో జరిగిన 18వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇన్స్‌పెక్టర్ కె.సతీష్, యం.రామారాయులు లు 30 ఏళ్ల జంట విభాగంలో రన్నర్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.టెన్నిస్ లో ప్రతిభ చాటిన ఇన్స్‌పెక్టర్ సతీష్, రామారాయులు లను పోలీస్ కమిషనర్ అభినందించారు.