Thursday, July 3, 2025

ఘనంగా ప్రపంచ డాక్టర్స్ డే…డాక్టర్లు సన్మానించిన ఇడుపుల రాజు…

స్టేట్ న్యూస్ తెలుగు, 1 జులై  ( జూలూరుపాడు )

జూలూరుపాడు మండలం కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డాక్టర్స్‌ డే ను జెపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు , తేజస్విని లను ఆసుపత్రి సిబ్బంది, జెపిఆర్ ఫౌండేషన్ ఇడుపుల రాజు సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …. నిత్యం గ్రామీణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.., చిన్న వయసులోనే జేపిఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజును అభినందించారు . ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తంబర్ల నరసింహారావు, కంచపోగు నరసింహారావు , ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular