రానున్న 4 నెలల పాటు మండల స్థాయి నుంచి ఆల్ ఇండియా పార్టీ స్థాయి వరకు మహాసభలు…
ఏచూరి స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళ్ళడమే ఆయనకు ఇచ్చే నివాళి –– నున్నా నాగేశ్వరరావు
స్టేట్ న్యూస్ తెలుగు,22 సెప్టెంబర్ (ఖమ్మం)
ప్రజా ఉద్యమాలను మరింతగా పదును పెట్టడానికి రానున్న 4 నెలల పాటు శాఖ స్థానం నుంచి పార్టీ ఆల్ ఇండియా స్థాయి వరకు వరుసగా మహాసభలు నిర్వహిస్తున్నట్లు CPM పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 57 వ డివిజన్ పరిధిలోని రమణగుట్టపై పార్టీ మూడు శాఖ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
N కుమారి, G బిక్షం అద్యక్షతన జరిగిన ప్రారంభసభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ., గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై చర్చించి, మరింతగా చురుకైన కార్యకర్తలకు తర్ఫీదు ఇవ్వడానికి ఈ మహాసభలు వేదికగా తయారు అవుతాయి అని తెలిపారు. రాష్ట్ర, జాతీయ మహాసభలో రాబోయే కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి ప్రజా పోరాటాలకు రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో మండల స్థాయి మహాసభలు జరుగుతాయని, డిసెంబర్ లో పార్టీ ఖమ్మం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరిలో రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి టౌన్ లో జరుగుతాయని, ఏప్రియల్ లో తమిళనాడు మదురై నగరంలో ఆల్ ఇండియా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రాజకీయాలను బిజెపి పార్టీ పూర్తి స్థాయిలో కలుషితం చేసింది అని, ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలను బిజెపి కు వ్యతిరేకంగా ఒక తాటిపై తేవడానికి ఒక ప్లాన్ ను ఆల్ ఇండియా మహాసభలో రూపొందించడం జరుగుతుంది అని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం ఏచూరి ఆశయాలను మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి పార్టీ శ్రేణులు కృష్ణ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్, నాయకులు గొపి , సత్యం, భిభి, పి శాంతయ్య, పావని, విజయ, సీతారాములు, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.