స్టేట్ న్యూస్ తెలుగు,30 సెప్టెంబర్ (భద్రాచలం)
భద్రాచలం ఐటిడిఏ ధర్నా చౌక్ లో ఈరోజు కొనసాగిన రిలే దీక్షలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలు కెచ్చల కల్పన దీక్షా శిబిరానికి సందర్శించి మాట్లాడుతూ., భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు ఆ యొక్క కళాశాలలో చదువుకోవటానికి వీలుంటుందని ముఖ్యంగా గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర బృందం నెల రోజులు ముందే 12 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి మరియు ఐటీడీఏ పిఓ కి ఇచ్చి నెల రోజులు గడుస్తున్న ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో విఫలం చెందారని ఆరోపించారు.అందులో భాగంగానే ఈరోజు దీక్షలకు పూనుకున్నారని అన్నారు. పిఓ పరిధిలో గల సమస్యలను కూడా పరిష్కరించలేని నిత్యాయ స్థితిలో ఉన్నది ఐ టి డి ఏ ఉందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో గోండ్వానా రాష్ట్ర కన్వీనర్ సోది వీరయ్య, రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, సున్నం సుబ్బయ్య, పాయం సన్యాసి, పార్వతి, సున్నం సీతక్క , పాయం కాంతమ్మ, భయం తిరుపతమ్మ, కారం చిన్నయ్య, పురం తులసి , పాయం భద్రమ్మ, గుర్రాల భవాని పాల్గొన్నారు.