శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ ,ఈడితో విచారణ జరిపించాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిజామాబాద్ నగర పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో ప్రత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.సందర్భంగా నాయకులు మాట్లాడుతూ., శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని , ర్యాంకుల కోసం మార్కుల కోసం విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గతంలో కుళ్లిన కూరగాయలతో వండుతున్నారని విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ,తప్పుడు డాక్యుమెంట్స్ తో అనుమతులు పొందారని ఫిర్యాదు చేసిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని .పైర్,గ్రౌండ్, అర్హతలు గల టీచర్స్ లేరని , స్టాఫ్ అందరికీ పి ఫ్ చెల్లించటం లేదని ,
ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లపై విచారణ చేపట్టాలని ,2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు,శ్రీ చైతన్య పై చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర నాయకులు నిఖిల్ ,దేవిక, మనోజ్, ముక్త శ్రీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై CBI,ED తో విచారణ జరిపించాలి …పి.డి.ఎస్.యూ..
RELATED ARTICLES