Saturday, January 18, 2025

ప్రజా సమస్యల పరిష్కారంలో సోషల్‌ మీడియాదే కీలకపాత్ర…సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం…

స్టేట్ న్యూస్ తెలుగు,26 ఆగస్టు(ఖమ్మం)

ప్రజలు సమస్యలు పరిష్కరించడంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి రెండు రోజులు రాజకీయ శిక్షణా తరగతులు సుందరయ్య భవన్ లో ప్రారంభం అయ్యాయి. సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాన మీడియా కార్పొరేట్ కనుసన్నల్లో మెలుగుతున్న దశలో సోషల్ మీడియా గ్రామీణ స్థాయిలో ప్రజా ఇబ్బందులను వెలుగు తీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల లో దివాలా కోరు విధానాలను ఎండగట్టాలన్నారు.

ఖమ్మంలోని సోమవారం సుందరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన సిపిఎం రాష్ట్ర సోషల్‌ మీడియా శిక్షణా తరగతులలో తమ్మినేని ప్రారంభ ఉపన్యాసం చేశారు.సోషల్ మీడియాతో యువత ప్రభావితమవుతోందని, అందుకే ఆధునిక ఆలోచనలతో కూడిన పార్టీ కార్యక్రమాలను మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా సామాజిక మార్పులో సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముందుకుసాగుతున్నారని తెలిపారు. పార్టీ పనివిధానం, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడంలో సరైన కార్యాచరణ లేక తమ నాయకత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు. దేశంలో BJP ప్రభుత్వం మూడోవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పిచ్చి అబద్దాలతో సోషల్ మీడియాలో విషం వెదజల్లే పనిలో BJP శ్రేణులు వున్నారు అని విమర్శించారు. ఫేక్ వీడియోలతో విద్వేషాలు నింపే పనిలో వున్నారు అని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే విధంగా సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు పని చేయాలని కోరారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ , ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండారు రవికుమార్, జగదీష్, వై విక్రమ్, సుందర్, శంకర్ ,నర్సిరెడ్డి , గొడుగు వెంకట్ యాటలసోమన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular