Saturday, January 18, 2025

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వీడాలి!…MRPS జిల్లా ఉపాధ్యక్షులు తోల్ల సురేష్….

స్టేట్ న్యూస్ తెలుగు, 05 డిసెంబర్ (నేలకొండపల్లి ):

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రంలో అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మౌనం వీడాలని MRPS జిల్లా ఉపాధ్యక్షులు తోళ్ల సురేష్ మాదిగ డిమాండ్ చేశారు.  నేలకొండపల్లి మండల కేంద్రంలో సుద్దేపల్లి గ్రామంలోని ఎమ్మార్పీఎస్ గ్రామ సభను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ., దేశంలో అనేక రాష్ట్రాలు వర్గీకరణ అమలపట్ల ముందుకు వెళ్తుంటే తెలంగాణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అదే సందర్భంలో నిండు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు, తక్షణమే వర్గీకరణ అమలు చేయాలని లేనియెడల మాదిగల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాయబారపు గురవయ్య మాదిగ గ్రామ అధ్యక్షుడు దారమళ్ళ వెంకటేష్ మాదిగ తోళ్ల వెంకటేశ్వర్లు మాదిగ తోళ్ళ శ్రీను మాదిగ
నేలకొండపల్లి టౌన్ అధ్యక్షులు గుండె పొంగు శ్రీకాంత్ మాదిగ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular