Saturday, January 18, 2025

కలకత్తా వైద్యురాలు డాక్టర్ మౌమితపై అత్యాచారం చేసిన నరహంతకుడు సంజయ్ రాయిని ఉరితీయాలి! ….సఖి జాతీయ మహిళా మండలి …

స్టేట్ న్యూస్ తెలుగు,17 ఆగస్టు ( ఖమ్మం) : సఖి జాతీయ మహిళా మండలిఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ నుండి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు . కలకత్తాలో డాక్టర్ మౌమిత అర్ధరాత్రి 36 గంటల వరకు కష్టపడి డ్యూటీ చేసి నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు దారుణంగా రేప్ చేసి దయ కరుణ, జాలి లేకుండా ముక్క ముక్కలుగా చేసి దారుణంగా హింసించి చంపడాన్ని సఖి జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ చైర్మన్ నరాల సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు .

కలకత్తా వైద్యురాలు డాక్టర్ మౌమితపై అత్యాచారం చేసిన నరహంతకుడు సంజయ్ రాయిని ఉరితీయాలి! ….సఖి జాతీయ మహిళా మండలి …కలకత్తా వైద్యురాలు డాక్టర్ మౌమితపై అత్యాచారం చేసిన నరహంతకుడు సంజయ్ రాయిని ఉరితీయాలి! ….సఖి జాతీయ మహిళా మండలి …దేశంలో నిర్భయ తరువాత దిశ తర్వాత అత్యంత దారుణమైన సంఘటన భారతదేశంలో జరగడం సభ్య సమాజాన్ని తలదించుకునే పరిస్థితిని తీసుకువచ్చిందని,ఇటు వంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తులను దుబాయిలో నడిరోడ్డులో ఏ విధంగా అయితే ఉరితీస్తారో ప్రజల ముందు ఆ విధంగా ఉరితీసి గుణపాఠం చెప్పాలని అటువంటి చట్టాలు తీసుకురావాలని సఖి జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సఖి జాతీయ మహిళా మండలి సోదరీ మణులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular