స్టేట్ న్యూస్ తెలుగు,14 డిసెంబర్
ఒక వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా పదేపదే నేరాలకు పాల్పడితే అతనిని రాడార్ లో ఉంచడానికి పోలీసులు రౌడీషీట్ నమోదు చేస్తారు. రెండూ , లేదా మూడు కంటే ఎక్కువ కేసులూ నమోదు అయినవారిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఫార్సు మేరకు ఏసీపీ లేదా సిపి హోదా అధికారులు రౌడీషీట్ ఓపెన్ చేస్తారు. పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగిన సందర్భాల్లో జడ్జి సూచనతో మాత్రమే హిస్టరీ షీట్ ఓపెన్‌చేయాలి. రౌడీషీట్ తెరవొద్దు.భూమాఫియా చేసే వారిపై , సెటిల్మెంట్‌లు చేసేవారిపై, హత్య కేసులు ఉన్నవారిపై, ఈవ్ టీజర్స్‌పై, దోపిడీలు చేసే వారిపై రౌడీ షీట్లు నమోదు చేస్తారు.రౌడీషీట్‌కు ఎఫ్‌ఐఆర్ ఉండదు.
రౌడీ షీట్ అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), 1973లోని సెక్షన్ 110 నిబంధనల ప్రకారం నిర్వహించబడే రికార్డు.CrPC యొక్క సెక్షన్ 110, “అలవాటు నేరస్థులు”గా పరిగణించబడే మరియు శాంతికి విఘాతం కలిగించే లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వ్యక్తులపై చర్య తీసుకోవడానికి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేస్తారు. కొంత కాలం పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు వారిని ఎందుకు కట్టడి చేయకూడదో కారణాన్ని చూపవలసిందిగా నిర్దేశిస్తూ,రౌడీ షీట్ ఓపెన్ చేయబోయే వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేస్తారు, ఆ వ్యక్తి కారణం చూపడంలో విఫలమైతే లేదా అతని కారణం సంతృప్తికరంగా లేదని తేలితే, పోలీసులు నిర్వహించే రౌడీ షీట్ కాపీతో పాటు వ్యక్తి యొక్క నేర చరిత్ర మరియు వివరాలను కలిగి ఉన్న ఒక నివేదికను సంబంధిత మేజిస్ట్రేట్‌కు పోలీసులు పంపుతారు.కొన్ని సందర్భాల్లో పోలీసులు రాజకీయ నాయకుల వత్తిడి మూలంగా కూడా కొందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనే విమర్శలు కూడా లేకపోలేదు…అలాంటి సందర్భాలలో బాధితుడు కోర్ట్ ని ఆశ్రయించవచ్చు.