అల్లూరి జిల్లా, రంపచోడవరం,
నవంబరు 12(స్టేట్ న్యూస్ తెలుగు):
ప్రజలందరూ మీ దగ్గరలోని పోస్ట్ అఫీస్ కు ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) లింక్ చేయించుకోవాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్
తెల్లం శేఖర్ మాట్లాడుతూ…బ్యాంక్ అకౌంట్ మరియు పోస్టల్ అకౌంట్ కలిగిన ప్రజలందరూ తప్పని సరిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) లింక్ చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.భవిష్యత్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమా అయ్యేందుకు ఎన్.పి.సి.ఐ మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు.చాలా మందికి ఎన్.పి.సి.ఐ మ్యాపింగ్ పూర్తి అవ్వక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసిన డబ్బులు,సబ్సిడీ డబ్బులు జమ కావటంలేదన్నారు.కావున ప్రజలందరూ తప్పని సరిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్.పి.సి.ఐ చేయించు కావాలన్నారు. అకౌంట్ లేని వారు పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పూర్తి వివరాలకు మీ దగ్గరలోని పోస్ట్ అఫీస్ ను సంప్రదించాలన్నారు.