స్టేట్ న్యూస్ తెలుగు, 18 మే (హైదరాబాద్):
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.కాగా పాత బస్తిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో .. మృతుల సంఖ్య 17కి చేరింది. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ
RELATED ARTICLES