స్టేట్ న్యూస్ తెలుగు, 3 జులై (భద్రాచలం )
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి సూచించారు. గ్రామపంచాయతీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు రాకుండా చేయవలసిన పనులన్నీ క్రమం తప్పకుండా గ్రామపంచాయతీ అధికారులు నిర్వర్తించాలి. గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన చెత్తను, శుభ్రం చేయడం గాని, బ్లీచింగ్ చల్లడం గానీ, దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయడం లాంటి పనుల మీద గ్రామపంచాయతీ అధికారులు దృష్టి సారించాలని వారికి సూచించారు. ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాలలో మురుగు నీరు, కానీ వర్షపునీరు కానీ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ అట్లా నిలువ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో దోమల వృద్ధి ఎక్కువవుతుంది. ఈ వర్షాకాల సమయంలో ప్రతి ఒక్కరూ కాసి వడపోసిన నీటిని త్రాగటం వలన అనారోగ్య సమస్యల కు దూరంగా ఉంటారని సూచించారు. ఒకవేళ వర్షానికి తడవడం వలన కానీ లేకపోతే దోమల బారిన పడటం వలన కానీ అనారోగ్య లక్షణాలు ఏమైనా కనబడితే వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.!..గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్ది
RELATED ARTICLES