Saturday, January 18, 2025

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి…

స్టేట్ న్యూస్ తెలుగు,07 ఆగస్టు(భద్రాచలం)
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, అలుగులు, బాగా పొంగి పొర్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున ప్రజలు అటువైపునకు వెళ్లకూడదని సూచించారు. అంతేకాకుండా వాగులు చెరువుల వద్ద సెల్ఫీలు దిగడం కూడా ప్రమాదకరమని సూచించారు. ఈ భారీ వర్షాల కారణంగా తరుచూ తడవడం వలన విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున, ప్రజల గోరువెచ్చని నీళ్లు త్రాగడం, వేడి ఆహార పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వస్తువులు, తడి కరెంటు స్తంభాల తో జాగ్రత్త, ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు దాటడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయవద్దని మరియు అత్యవసరమైతే తప్ప ప్రజలను బయటకి రామాకండి అని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular