స్టేట్ న్యూస్ తెలుగు, హైదరాబాద్:డిసెంబర్ 22:
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
మరోసారి రాయితీలపై పెండింగ్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ సన్నద్దమవుతున్నట్లు సమాచారం.
ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారట. గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాలు వసూలయ్యాయి.
ఈ ఏడాది కూడా మరోసారి రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.