స్టేట్ న్యూస్ తెలుగు,23 సెప్టెంబర్ (ఖమ్మం)
దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై నిజాయితీగా, రాజీ లేని పోరాటాలు చేసే సంఘంగా CITU కు గుర్తింపు వుంది అని, యాజమాన్యాల ఒత్తిడికి లొంగకుండా కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా CITU భావిస్తుంది అని, CITU రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఖమ్మం బైపాస్ రోడ్ పెద్ద కూరగాయల మార్కెట్ లో CITU హమాలీ నూతన కమిటీ సమావేశంలో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్ పెద్ద కూరగాయల మార్కెట్ లో కార్మికుల విశ్రాంతి హల్ లో జరిగిన మీటింగ్ లో శ్రీకాంత్ మాట్లాడుతూ.,
ఖమ్మం నగరంలో వందల సంఖ్యలో CITU కు అనుబంధంగా వందల సంఖ్యలో రంగాలు వారిగా వివిధ సంఘాలు వున్నాయని, ప్రతి సందర్భంలోనూ కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా భావించి నిజాయితీగా కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పోరాటాలు నిర్వహించేది కేవలం CITU సంఘం మాత్రమే అని సృష్టం చేశారు.
ఖమ్మం బైపాస్ కూరగాయల మార్కెట్ లో వారు పడుతున్న కష్టాలకు అనుగుణంగా సరియైన వేతనం హమాలీలకు వచ్చే విధంగా తగిన పోరాటం చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రతి కార్మికుడు కు నెలకు కనీస వేతనం 25 వేలు వచ్చే విధంగా రాబోయే కాలంలో కార్మిక సంఘాలను కలుపుకుని పోరాటాలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో సగటు కార్మికుడు కష్టాలు పడుతున్నాడు అని, వారు ఇబ్బందులు తొలగి పోవాలంటే BJP విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు నూతన కమిటీ ను ఎన్నుకోనున్నారు.
కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు నూతన కమిటీ
గౌరవ అధ్యక్షులు వై.విక్రమ్ ,
గౌరవ సలహాదార్ అరిగే బీరప్ప
అధ్యక్షులు గొడుగు సైదులు
ఉపాధ్యక్షులు శనిగరపు శీను
ఉపాధ్యక్షులు ఆకుల ఎంకన్న
ప్రధాన కార్యదర్శి మేడబోయిన సీతయ్య
సహాయ కార్యదర్శి బడికే నరసింహ
సహాయ కార్యదర్శి కర్రే రమేష్
సహాయ కార్యదర్శి చిన్న ఇస్తారి
కోశాధికారి వేముల సత్యనారాయణ ను ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమంలో
భుక్యా శ్రీనివాసరావు రావు, బండారు యాకయ్య, బోడపట్ల సుదర్శన్, భుక్యా ఉపేంద్ర నాయక్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.