Friday, July 4, 2025

ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా  అనుమతులు లేకుండా జి+4 అంతస్తుల భవనాల కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోరా..!?….    గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం…

స్టేట్ న్యూస్ తెలుగు,21 సెప్టెంబర్ (కొత్తగూడెం)

విచ్చల విడిగా వెలస్తున్న ఏజెన్సీ పంచాయతీ విద్యానగర్ లో బహుళ అంతస్తులు …అందులో షాపింగ్ మాల్స్ వెలుస్తున్నా  అధికారులు ఎదుకు చర్యలు తీసుకోవడం లేదని  గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఓ ప్రకటనలో ప్రశ్నించారు.అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉన్నా చోద్యం చూస్తున్నారని ఆవేదన చెందారు. విచ్చల విడిగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధగంగా ఏజెన్సీ లో బహుళ అంతస్తుల నిర్మాణం కట్టడాలు చేస్తుంటే పంచాయితీ సిబ్బంది మాత్రం నోటీసులకే పరిమితము  అవడం చూస్తుంటే  లేనిపోని అనుమానాలకు దారితీస్తుందని అనుమానాన్ని వ్యక్తం పరిచారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచు పల్లి మండలం పరిధిలోని విద్యనగరం లో మానవహక్కుల సంఘము జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.,విద్యానగర్ పంచాయితీ పరిధిలో ఏజెన్సీ చట్టాల దుర్వినియోగం చేస్తూ జి +4 భావనాలను  ఏజెన్సీ చట్టాల కు వ్యతిరేకంగా,. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ లాంటి చర్యలకు పాల్పడిన వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాలు ..జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందిక పోవడం శోచనియం అన్నారు. ఏజెన్సీ ఆదివాసీల చట్టాలు ఎవరికి చుట్టాలగా మారాయి అంటే వలస వాణిజ్య వ్యాపార గిరిజనేతరులకె అని ఈ షాపింగ్ మాల్స్ చూస్తే అర్థమవుతుందని తెలిపారు. దీనిపై సదరు పంచాయతీ కార్యదర్శి ని వివరాలు కోరగా అనుమతులు ఇవ్వలేదని తెలిపారని, వారికి 2018 పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులకె పంచాయితీ రాజ్ చట్టం పరిమితము అయ్యిందా?..చర్యలు ఎక్కడ..!? అని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఏజెన్సీ చట్టాలను కాపాడక పోతే ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కొరతామని సూచించారు.ఈ కార్యక్రమంలో కిష్టా శ్రీనివాస వాల్మీకి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular