ఖమ్మం మెడికల్ హబ్ లో BVK – VVC ట్రస్ట్ ల ఆధ్వర్యంలో త్వరలో ప్రజలకు మరింత చేరువగా మెడికల్ సేవలు
స్టేట్ న్యూస్ తెలుగు,25 సెప్టెంబర్ (ఖమ్మం)
ఖమ్మం నగరంలో సామాన్య ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, నాణ్యత కలిగిన జనరిక్ మెడిసిన్స్ ను పంపిణీ చేయడానికి మాత్రమే మెడికల్ షాపు ప్రారంభం చేస్తున్నట్లు VVC , BVK ట్రస్ట్ ల ఛైర్మన్ లు వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, నున్నా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

VVC (వంకాయలపాటి వీరయ్య చౌదరి) మరియు BVK (బోడేపూడి వెంకటేశ్వరరావు కేంద్రం) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం వైరా రోడ్ డాక్టర్ సత్యనారాయణ హాస్పిటల్ కాంప్లెక్స్ లో నూతన జనరిక్ మందుల షాపు ను వంకాయలపాటి ద్రౌపది,రాజేంద్రప్రసాద్, నున్నా నాగేశ్వరరావు లు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., ఖమ్మం నగరంలో జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షణ కోసం, శరీరంపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా , లాభాపేక్షణ లేకుండా తక్కువ ధరలకు, నాణ్యత కలిగిన ముందులు ప్రజలకు అందుబాటులో వుండే విధంగా జనరిక్ మందుల షాపు ప్రారంభం చేస్తున్నట్లు పేర్కొన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు ట్రస్ట్ ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశామని, కరోనా సమయంలో పలువురు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలకు వెనకాడితే తమ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయడంలో, ఆపద సమయంలో ప్రజలకు నిజాయితీగా, చిత్తశుద్ధితో సేవా కార్యక్రమాలు పలు నిర్వహించామని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో తాగునీరు సమస్య వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. పేద ప్రజలు , మిడిల్ క్లాస్ ఏరియాలో అనేక మెడికల్ క్యాంపులు పెట్టి లక్షలు విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. BVK, VVC ఆధ్వర్యంలో త్వరలో ఖమ్మం నగరంలో పేద,మధ్యతరగతి ప్రజలకు పూర్తి స్థాయిలో మరింతగా నిరంతరం వైద్య సేవలు కొనసాగించడం కోసం ఒక కార్యక్రమం తీసుకోబోతున్నట్లు తెలిపారు . రాబోయే కాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు వైద్యం సేవలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు , వై విక్రమ్, కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేందర్, బాబ్జి, CPM పార్టీ నాయకులు నాయకులు వై శ్రీనివాసురావు, బోడపట్ల సుదర్శన్, M సుబ్బారావు, మాదినేని రమేష్, MA జబ్బర్, పి ఝాన్సీ, వాసిరెడ్డి వీరభద్రం, శివనారాయణ, బండారు యాకయ్య, మీరా సాహిబ్,R ప్రకాష్, రమేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.