ఆశ్రమ పాఠశాలలో ఏ.ఎన్.ఎం పోస్టులు భర్తీ చేయాలి!
….ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేసిన ఆదివాసీ జేఏసీ నాయకులు…
అల్లూరి జిల్లా, రంపచోడవరం, ఆగస్ట్ 12స్టేట్ న్యూస్ తెలుగు)
ఈ రోజు రంపచోడవరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం కు,కొత్త వీధి గ్రామంలో ముసురు మిల్లి ప్రాజెక్ట్ కాలువకు పడిన గండిని పూడ్చి దేవారం,శరభ వరం పంచాయితీల రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరియు ఆశ్రమ పాఠశాలలో ఏ.ఎన్.ఎం పోస్టులు భర్తీ చేయాలని మొదలైన సమస్యలపై వినతి పత్రం సమర్పించామని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండల పరిధిలోని(1) ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువకు లష్కర్ లను నియమించాలి,మరియు కొత్త వీధి గ్రామంలో ముసురు మిల్లి కాలువకు పడిన గండిని పూడ్చి దేవారం,శరభరం గ్రామపంచాయతీల రైతులకు సాగునీరు అందించాలని,(2) దేవారం గ్రామ పంచాయతీలోని దేవారం,చిన్నారి గండి,పోతవరం గ్రామాలకు మరియు ఇందుకూరు గ్రామపంచాయతీ లోని ఇందుకూరు గ్రామంలో ఉన్న పాత అంగన్వాడి బిల్డింగ్స్ తొలగించి కొత్త అంగన్వాడి బిల్డింగ్స్ మంజూరు చేయాలని(3) దేవారం,ఇందుకూరు పంచాయతీలలో ఆదివాసి పేదలకు ఇచ్చిన 56 కొండపోడు పట్టాలకు భూములు రి సర్వే చేసి అప్పగించాలని,(4)గోకవరం ఆర్టీసీ డిపో నుండి చిన్నారి గండి గ్రామం వరకు మూడుపూటల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, (సౌకర్యం కల్పించాలని),(5)దేవారం గ్రామపంచాయతీలో ఉన్న దేవారం,పోతరం,చిన్నారి గండి గ్రామాలలో ఉన్న 15 చెరువులకు మరియు ఇందుకూరు గ్రామంలో ఉన్న తమ్మిశెట్టి వారి చెరువు ఉన్న రెండు తూములు మరియు కలవర్ట్ల కొత్తవి నిర్మించాలని (6)పోలవరం నిర్వాసితులందరికీ గ్రామాల ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలని(7) దేవీపట్నం మండల కేంద్రం నుండి వెళ్లే మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించాలని (8)ఎం. రావిలంక గ్రామం నుండి పోతవరం గ్రామం వరకు తారు రోడ్డు వెంబడి కరెంటు స్తంభాలు వెయ్యాలని (9) వెలగ పల్లి గ్రామంలో ఉన్న కాలువకు బిడ్జి నిర్మించాలి.(10) దేవారం గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మించాలని (11) ఇందుకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పక్కా భవనాలు నిర్మించాలని (12)కొత్త కాలనీలు మంజూరు చేయాలని (13) ఏకలవ్య పాఠశాలలో స్థానిక ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని (14) ఏపీ టెట్ మరియు డీఎస్సీ అభ్యర్థులకు ఐటిడిఏ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ వసతితో పాటు స్టడీ మెటీరియల్ ఇవ్వాలని,(15)ఆశ్రమ పాఠశాలలో ఏ.ఎన్.ఎం పోస్టులు గతంలో పనిచేసిన వారితోనే భర్తీ చేయాలని(16)రంపచోడవరం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని (17)రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర పేరుతో ప్రత్యేక జిల్లా ప్రకటించాలని (18)ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని (19) 1/59,పీసా చట్టం,అటవీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని(20)దేవి పట్నం మండలం తహశీల్దార్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో వీఆర్వో పోస్టులు భర్తీ చేయాలని (21) షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం అమలు చేయాలని మొదలైన సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సుండం బాబు రావు,పి.పాపారావు,ఎస్.సుధాకర్ మొదలైన వారు పాల్గొన్నారు.