స్టేట్ న్యూస్ తెలుగు, 01 మార్చి (నేలకొండపల్లి / ఖమ్మం)
నేలకొండపల్లి మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్దులకు మోటివేషన్, కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు.మండల విద్యాశాఖ, పిఎంఆర్ ట్రస్ట్ సయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెందుర్తి రవి పిల్లలకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. క్రమశిక్షణ, పట్టుదల, దానికి తగ్గట్టు ప్రణాళిక అవసరం అని, ప్రతి విద్యార్థి స్పష్టమైన చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవడం వలన పెద్ద లక్ష్యాలను సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విద్యాధికారి సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ., జీవితంలో కొన్ని కలలు ఉంటాయి ప్రతి రంగంలో ముందుకు వెళ్లాలంటే ప్రాథమికంగా విద్య చాలా అవసరమని ఒక్క వ్యక్తి విజయాన్ని వందలమంది అభినందిస్తారన్నారు .

ఒక్క విజయం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మనకున్న సామర్థ్యం గొప్పది , అవకాశాలను సృష్టించుకోవాలని తెలిపారు.
సివి రామన్ తరువాత మనకు ఒక్క నోబెల్ ప్రైజ్ లేదంటే మనం ఎక్కడికి పోతున్నామో అర్థం చేసుకోవాలి. అందుకే మీరందరూ కష్టపడి గొప్పగా ముందుకు వెళ్లాలి. ప్రపంచంలో గొప్ప క్రీడ ఫుడ్ బాల్, కానీ మనలో ఎవరు ఆడారు. ఒలంపిక్ వెళ్లి మనం ఎన్ని పథకాలు గెలిచామో చూసుకోవాలి. అనంతరం విద్యార్దులకు పరిసరాల శుభ్రత గురించి వివరించారు. చేతన ఫౌండేషన్ వారు విద్యార్దులకు విద్యాసమగ్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్, మండల విద్యాధికారి చలపతిరావు, వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీందర్, ఈనాడు శ్రీధర్, నాగరత్నం, ప్రభుత్వ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్, పురుషోత్తం, పిఎంఆర్ ట్రస్టు సభ్యులు మరియ ప్రసాద్, ప్రగతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.