వారు ఓట్లు వేస్తే కూడా లెక్కించరా…!!!???
…పోలీసులను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్ట్.,.
స్టేట్ న్యూస్ తెలుగు, 25 జూన్
తెల్ల చొక్కా వేసుకొస్తేనే గౌరవం ఇస్తారా…?.. మురికి బట్టల్లో వచ్చిన వారు ఫిర్యాదు చేస్తే తీసుకోరా..!!??.. అని పోలీసులను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా ఓ ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. అక్కడి సిబ్బంది అతడిని కనీసం కూర్చోనివ్వలేదు. దీంతో అతడు తనకు అవమానం జరిగందంటూ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే మాట్లాడుతూ., మురికి బట్టలు వేసుకు వచ్చిన వారు ఫిర్యాదు చేస్తే తీసుకోరా అని ప్రశ్నించింది. మరి వారు ఓట్లు వేస్తే కూడా లెక్కించరా అంటూనే.. ఫలానా వారు మాత్రమే కూర్చోవాలి, మిగతా వారు కూర్చోకూడదంటూ చెప్పే హక్కు మీకు ఎక్కడిదని అడిగింది.ఇలా తనను కూర్చోనివ్వకుండా అవమాన పరచడంతో సదరు వ్యక్తి ఎస్సైపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దాన్ని గమనించిన కమిషన్ వెంటనే పోలీసులకు నోటీసు పంపింది. సదరు వ్యక్తి ఈ ప్రాతిపదికన ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. దీనిసై జస్టిస్ వేలమురుగన్ ఇటీవలే విచారణ జరిపారు. పిటిషనర్ సూచించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషన్ దారుడిని స్టేషన్‌లో కూర్చోనీయకుండా అవమానించిన పోలీసులు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు.ఇన్‌స్పెక్టర్ ముందు కూర్చోవడానికి ఫిర్యాదు దారుడికి ఎందుకు అనుమతి ఇవ్వలేదంటూ ప్రశ్నంచారు. మురికి చొక్కాతో వస్తే ఫిర్యాదు తీసుకోరా అని న్యాయమూర్తి నిలదీశారు. అలాగే అలాంటి వారు ఎన్నికల్లో ఓట్లు వేస్తే వాటిని లెక్కించరా అంటూ అడిగారు. ఫలానా వారు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి, మిగిలిన వారు కూర్చోకూడదని చెప్పేందుకు మీరు ఎవరు, మీకు ఆ హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సంబంధిత ఇన్‌స్పెక్టర్‌పై రెండు వారాల్లో చర్యలు చేపడతారని సమాధానం ఇచ్చారు. దాంతో న్యాయమూర్తి విచారణను జులై 15వ తేదీకి వాయిదా వేశారు.