స్టేట్ న్యూస్ తెలుగు, 14 డిసెంబర్(హైదరాబాద్)
ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు, ఆ పార్టీ నేతలతో గురువారం నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహి స్తామని ఆయన వెల్లడిం చారు.
నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, నేడు ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని కెటిఆర్ తెలిపారు.
ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకొని, ఓటమికిగల కారణాలను లోతుగా విశ్లేషించుకుంటామని తెలిపారు.
అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు, కార్య కర్తలు ఎటువంటి నిరాశ పడొద్దని, ఇది పార్టీకి తాత్కాలికి బ్రేక్ మాత్ర మేనని ధైర్యం చెప్పారు.