స్టేట్ న్యూస్ తెలుగు,15 సెప్టెంబర్(ఖమ్మం)
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి
మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు
తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి మృతి సీపీఎం పార్టీకి తీరని లోటు అని, వారి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తి అని అన్నారు. వారి కుటుంబానికి దేవుడు ధైర్యం కల్పించాలి అని కోరుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
.