అల్లూరి జిల్లా, దేవీపట్నం,
నవంబరు 30.(స్టేట్ న్యూస్ తెలుగు):
డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం,పారా లీగల్ వాలంటీర్,ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండల పరిధిలోని ఇందుకూరు గ్రామానికి సమీపంలో ఉన్న జీడి మామిడి తోటలో ఇందుకూరు గ్రామ కాపురస్తులు కానూరి రామకృష్ణ భార్య సత్యవతి దంపతులు కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు దగ్గర ఘనంగా వన దేవతలకు నైవేద్యం సమర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులు చిన్న పెద్ద అందరూ కలిసి కార్తీక వన భోజనాలులో పాల్గొన్నరన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్,ఆదివాసీ జేఏసీ దేవీ పట్నం మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరావు,డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్,దేవీ పట్నం బీజేపీ మండల అధ్యక్షుడు,ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,బిజెపి దేవీ పట్నం మండల ప్రధాన కార్యదర్శి కుండ్ల సాయి రామ్ రెడ్డి,బి.జే.వై.ఎం.దేవీ పట్నం మండల అధ్యక్షుడు నడి పూడి గణపతి రెడ్డి,టిడిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ నడిపూడి భాను శంకర్ రెడ్డి,మరియు కానూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నరన్నారు.