సాలగ్రామ అభిషేకంలో తండోపతండాలుగా పాల్గొన్న భక్తులు
.స్టేట్ న్యూస్ తెలుగు, డిసెంబర్ 26.
.(రిపోర్టర్ అహ్మద్).

భద్రాచలం: గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఈరోజు మంగళవారం విశేష పూజలు నిర్వహించడం జరిగినది.సాలగ్రామమూర్తికి విశేషంగా అభిషేకాలను నిర్వహించి అభిషేక తీర్థాన్ని భక్తులకు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా నృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ గో – గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ప్రతిరోజు విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే ఈరోజు అభిషేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినదని అన్నారు. ఎన్నో మహిమలు చూపుతున్న కల్పవృక్ష నారసింహ సాలగ్రామమూర్తికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు ముందుగానే చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. అలానే సాలగ్రామ దర్శనం కొరకు వచ్చిన భక్తులందరికీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో ప్రతి నిత్యం ఉచిత అన్నదానాన్ని అందిస్తున్నామని అన్నారు. ఇక్కడ ఏది కోరితే అది జరుగుతుందని టీవీ లో చూశామని గతం లో మా బంధువులు వచ్చి ఇక్కడ అభిషేకం, పూజలు చేశాక వారికి 12 సంవత్సరాలుగా సంతానం లేని వారికి సంతానం కలిగిందని, మేము కూడా సంతానం కోసం ముడుపులు కట్టడానికే వచ్చామని ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేని ఎంతో మందికి సాలగ్రామ తీర్థం తీసుకున్నాక సంతానం కలిగిందని అందుకే శ్రీకాకుళం నుండి వచ్చామని కొందరు భక్తులు చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంస్థ సభ్యులు సేవలందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి, అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.