Friday, July 4, 2025

30న భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా చౌక్ లో జరిగే రిలే దీక్షలను జయప్రదం చేయండి… పాయం.గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ…

స్టేట్ న్యూస్ తెలుగు,28 సెప్టెంబర్ (భద్రాచలం)

భద్రాచలం శనివారం నాడు ఐటిడిఏ ధర్నా చౌక్ ఆవరణలో సున్నం సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ., ఏజెన్సీ ప్రాంతాలకు భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఆఫీస్ ఆదివాసుల మౌలిక సమస్యలు మరియు భూమి సమస్యలు ఆదివాసి హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని ఐటీడీఏ అధికారులను కోరారు.
ఏజెన్సీలోకి వలసలు విపరీతంగా పెరిగిపోయాయని వలసలు మూలంగా ఏజెన్సీలో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసుల మనుగడ భవిష్యత్తులో ప్రమాద అంచులో పడిపోతుందని కావున ప్రభుత్వం వలస నిరోధక చట్టం రూపకల్పన చేయాలని ఆదివాసీల మనుగడ కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా అవసరం ఉందని అన్నారు.పేరుకే ఐటీడీఏ ఏజెన్సీ చట్టాలు ఏ మండల కేంద్రంలో గాని జిల్లా కేంద్రంలో మరియు నియోజకవర్గ కేంద్రంలో గాని అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసీలకు భూమితోనే జీవనాధారం అలాంటి భూములను వలస గిరిజనేతర కబ్జా చేతుల్లోకి మారాయని ఇలాంటివి అనేక సమస్యలు ఆదివాసులకు ఎదురవుతున్నాయని ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే 30న దీక్షలు ప్రారంభానికి సిద్ధమయ్యామని వెల్లడించారు. ఈ యొక్క సమావేశంలో పాయం సన్యాసి కారం సుధ కారం లక్ష్మి పోడియం నాగమణి కారం సమ్మక్క పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular