స్టేట్ న్యూస్ తెలుగు,19 అక్టోబర్ (భద్రాచలం)
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఆకుల వారి ఘనపురం వై జంక్షన్ స్థలంలో ఆదివాసి పోరాట యోధులు కొమరం భీమ్ విగ్ర ఆవిష్కరణకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లంవెంకట్రావు ని మర్యాదపూర్వకంగా కలిసిఆహ్వాన పత్రాన్ని ఆదివాసి జే.ఈ.సి ఆహ్వానించారు.అలాగే 84వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 24న ఎటూరు నాగారంలో ఏర్పాటు చేస్తున్న కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు ఆదివాసి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆదివాసి మేధావులు ,ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి జే.యి.సి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఆది వాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ,ఆదివాసి సీనియర్ లాయర్ పర్షిక సోమరాజు, సీనియర్ ఆదివాసి నాయకులు కుంజా శ్రీనివాసరావు, పోదెం కృష్ణ ప్రసాద్, టి డబ్ల్యూ టి యు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సందా మహేష్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.