Thursday, July 3, 2025

అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన ఒలంపిక్ రన్ సక్సెస్ … జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి..

స్టేట్ న్యూస్ తెలుగు,20 జూన్ (భద్రాచలం)

ఉల్లాసంగా భద్రాచలంలో ఒలంపిక్ డే రన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా 18 తారీకు పాల్వంచలో మొదలైన ఒలంపిక్ రన్ నిన్న దమ్మపేట చేరుకుని ఈరోజు ఉదయం 6:30 కి భద్రాచలం లో ఒలంపిక్ జ్యోతిని క్రీడాకారులు ఎమ్మెల్యే  తెల్ల వెంకటరావుకి అందజేశారు ఈ సందర్భంగా తెల్ల వెంకటరావు మాట్లాడుతూ., భద్రాచలంలో త్వరలో ఒక 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదు ఎకరాలు సేకరించాలని త్వరలో ఆ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తెస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓ బి రాహుల్  మాట్లాడుతూ.,భద్రాచలం పరిసర ప్రాంతంలో గిరిజన క్రీడాకారులు అద్భుతంగా రానిస్తున్నారని వారికి మా సహకారం ఇవ్వటం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తారని తెలిపారు . ఈకార్యక్రమంలో భద్రాచలం ఏ ఎస్ పి విక్రమ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ., యువత గంజాయి లాంటి చెడు వ్యసనానికి పోకుండా క్రీడల వైపు మల్లాలి అని భద్రాచలం ని గంజాయి రహిత పట్టణంగా మార్చాలని యువతని కోరారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ., జిల్లా క్రీడాకారులకు మంచి క్రీడా సదుపాయాలు కలగజేస్తే మంచి అంతర్జాతీయ క్రీడాకారులని అందచేస్తాము అని తెలిపారు.

అనంతరము అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ ఒలంపిక్ డే రన్ సుమారు 200 మంది స్థానిక క్రీడాకారులు చాలా ఉత్సంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ కే మహిధర్, చీఫ్ పాటర్న్ నాగ సీతారాములు, వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ పి నాగేంద్రబాబు, భద్రాచలం కన్వీనర్ గిరి ప్రసాద్, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దాట్ల రాజు,జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ కుంచాల రమేష్,ఉదయ్ కుమార్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జీ వి రామి రెడ్డి ( సిటీ స్టైల్ జిమ్ కోచ్ ) పీడీలు శ్వేత దుర్గారావు, ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular