Friday, July 4, 2025

ఆహారం మార్పు ద్వారానే ఆరోగ్యం సురక్షితం … ప్రముఖ వైద్యులు గట్టినేని సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు…

300 మందికి ఉచితంగా 2డి ఎకో పరీక్షలు చేసిన ప్రముఖ డాక్టర్ పేర్ల హర్షతేజ

స్టేట్ న్యూస్ తెలుగు,03 ఆగస్టు(ఖమ్మం)

అనారోగ్యానికి దూరంగా వుండాలంటే ప్రతి రోజూ సరైన వ్యాయామంతో పాటు, సమతుల్యం కలిగిన ఆహార నియమాలు పాటించడం ద్వారా జీవిత కాలం ప్రతి వ్యక్తి సంతోషంగా జీవితం గడపవచ్చు అని స్తంభాద్రి హాస్పిటల్ ప్రముఖ వైద్యులు గట్టినేని సురేష్, సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.

ప్రతి నెల నెలా ఉచిత మెడికల్ క్యాంపులో భాగంగా శనివారం ఖమ్మం మంచికంటి పంక్షన్ లో వైద్య శిబిరం జయప్రదంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., సమాజం మారుతున్న తరుణంలో మంచి ఆరోగ్య ఆహారం తీసుకోకుండా నేటి యువతరం పాస్ట్ ఫుడ్ కు అలవాటు పడ్డారని దిని ఫలితంగా తక్కువ వయస్సులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు మనిషిని చుట్టూముడుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. రోజూ రోజుకు పెరుగుతున్న జింక్ ఫుడ్ ఫలితంగా కేన్సర్ పెద్ద ఎత్తున పెరుగుతుంది అని, రాబోయే కాలంలో క్యాన్సర్ మరింత విజృంభించక ముందే మనిషి మేలుకోవాలని సూచించారు. ప్రతి రోజూ వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అని కోరారు. బలమైన ఆహారం, సమతుల్యంగా వుండే ఆహారం తీసుకోవడం ద్వారా గుండెపోటుకు గురి కావడం చూసుకోవచ్చు అని పేర్కొన్నారు. ప్రతి నెల నెలా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సేవలు పెంచాలని వారు సూచించారు. మెడికల్ క్యాంపులో 300 మంది ప్రజలకు గుండెకు సంబంధించిన 2డి ఎకో పరీక్షలు పూర్తిగా ఉచితంగా ప్రముఖ డాక్టర్ పేర్ల హర్షతేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్తంభాద్రి హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ మేదరమెట్ల అనిల్ కుమార్, గుమ్మడి రాఘవేంద్ర, డొగుపర్తి కృష్ణ సుమంత్ 400 మంది పేషెంట్లకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా విలువైన మందులు పంపిణీ చేశారు. ప్రముఖ వైద్యులు చీకటి భారివి, కొల్లి ఆనుదీప్, పిల్లలమర్రి సుబ్బారావు, జెట్ల రంగారావు ఆధ్వర్యంలో బిపి, షుగర్, పక్షవాతం పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, నాయకులు వై శ్రీనివాసురావు, పి ఝాన్సీ, వాసిరెడ్డి వీరభద్రం, నర్రా రమేష్, పి వాసు, అఫ్జల్ , అరుణ , పి కృష్ణారావు, టి జనార్ధన్, వెంకట్రావు, మెహన్, CH భద్రం , గుమ్మడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular