Saturday, January 18, 2025

కొత్తిమీర వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే….వదలరు

కొత్తిమీర శాకాహారనికి మరియు మాంసహారానికి కూడా మంచి రుచినిస్తుంది.అంతే కాదు ఇందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజలవణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి.అందువల్ల ఈ కోతిమీరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వజ్రాయుధంలా ఉపయోగపాడుతుందని చెప్పొచ్చు.నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు ఎంతో ఉపయోగకరం.ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీర ఆకుల రసం తేనెతో కలుపుకొని తాగితే మంచిగా ఉపయోగ పడుతుందని ఆయుర్వేదం చెప్పుతుంది.కొత్తిమీరలో విటమిన్ కే ఉండటం వలన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేయడం వలన గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది అంటారు.అంతే కాదు విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ నుంచి ఈ కోతిమీర కాపాడుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతుంటారు.ఫ్రీ రాడికల్స్ మన కణాలను దెబ్బతీసి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటికి కారణమవుతాయి. కొత్తిమీరలో ఉండే ఆంటాక్సిడెంట్లు ఇలాంటి ప్రమాదాలను నివారిస్తుంది.కొత్తిమీర శరీరంలోని అదనపు సోడియంను బయటికి పంపించే గుణం ఉండటం వలన రక్త ప్రసారణ అదుపులో ఉంటుంది.అంతే కాదు మన శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఎథెరోస్ల్కెరోసిస్ అనే గుండె జబ్బు రిస్క్‌ను తగ్గిస్తుందని కూడా చెపుతారు.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కోతిమీరను మనం తినకుండా ఉండగలమా మీరే ఆలోచించండి.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular