స్టేట్ న్యూస్ తెలుగు, 27 మే (ఖమ్మం)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ దివ్యమూర్తికి మై కంప్యూటర్ ఎడ్యుకేషన్ యాజమాన్యం ప్రతిభాశాలి అవార్డు అందజేయడం జరిగింది. ఈ అవార్డును మై కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బూర సైదారావు గౌడ్ చేతుల మీదుగా గుగ్గిళ్ళ దివ్యమూర్తి అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా దివ్యమూర్తి మాట్లాడుతూ., తనకు ఇప్పటివరకు 33 అవార్డులు వచ్చాయని తెలియజేశారు. మై కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు తనకు ప్రతిభాశాలి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుతో పాటు శాలువాతో పూలమాలవేసి దివ్యమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమం ఆదివారం నాడు ఖమ్మం జిల్లా బల్లేపల్లిలో యూనియన్ బ్యాంకు బిల్డింగ్ పైన జరిగింది. ఈ కార్యక్రమంలో మై కంప్యూటర్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బూర సైదారావు గౌడ్, A1 కంప్యూటర్స్ అధినేత నాగేశ్వరరావు, నరసింహారావు గౌడ్, దేశగాని కోటేశ్వరరావు గౌడ్, శేఖర్, పసుమర్తి గురునాథం, రవి, అలీ, ఆనంద్, బాబురావు, పెంబుల పాపారావు, మహేష్ ఫ్యాన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కందుల మహేష్ , కిన్నెర గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.