స్టేట్ న్యూస్ తెలుగు,09 డిసెంబర్ (హైదరాబాద్)
సోమవారం నాడు హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు అలాగే ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధుని కలసి భద్రాచలం కేంద్రంగా న్యాయకళాశాల ఏర్పాటు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్పా డిమాండ్ చేసారు.

అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటుకు చట్టసభల్లో ప్రస్తావించి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏజెన్సీకి నడిబొడ్డున ఉన్న భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారని ఆశా భావం వ్యక్తం చేశారు.