స్టేట్ న్యూస్ తెలుగు,09 ఆగస్టు(భద్రాచలం):
ఈరోజు భద్రాచలంలో గిరిజన భవనంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఐ టి డిఏ పివో కి గోండ్వానా సంక్షేమ పరిషత్ తరుపున ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా ప్రధాన డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. గిర్ గ్లాని కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఏజెన్సీ చట్టాలను పరిరక్షించాలని, కోనేరు రంగారావు కమిటీ సిపార్సులు ఏజెన్సీలో అమలు చేయాలని,భద్రాచలం డివిజన్లో ఆదిమ తెగల భూములను వలస గిరిజనేతరులు కబ్జా చేయకుండా పటిష్టంగా చట్టాన్ని అమలు చేయాలని,భద్రాచలం దేవస్థానం భూములను వలస గిరిజనేతరుల కబ్జా నుండి రక్షించాలని,భద్రాచలం డివిజన్లో స్థానిక ఆదిమ తెగల కోసం ఒక న్యాయ కళాశాలను మంజూరు చేయాలని, భద్రాచలంలో ఆదిమ తెగలకు ఇంటర్ డిగ్రీ విద్యార్థుల కోసం పర్ణశాల గెస్ట్ హౌస్ స్థానంలో ఎస్ఎంహెచ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ను పునరుద్ధరించాలని,పర్ణశాల గెస్ట్ హౌస్ను లా కాలేజీకి కోసం ఉపయోగించాలని,పర్ణశాల గెస్ట్ హౌస్ ప్రాంగణంలో పూర్వ కాలేజీ ఎస్ఎం హెచ్ హాస్టల్ నిరుపయోగంగా ఉన్నందున నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలని,ఆనాటి కేంద్రమంత్రి జయరామ్ రమేష్, బలరాం నాయక్ ఎంపీ, జిల్లా మంత్రి నాగేశ్వరరావు, ఆనాటి ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే స్వర్గీయ సునం రాజయ్య అధ్యక్షతన శంకుస్థాపన చేసిన ప్రభుత్వ భూమిని వలసవాదుల కబ్జా నుండి స్వాధీనం చేసుకోవాలని,భద్రాచలం ఐటిడిఏ పాలక మండలి లో లా కళాశాల ఏర్పాటుకు తీర్మానం చేయాలనే ప్రధాన డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని ఐ .టి. డి.ఏ. మరియు జిల్లా కలెక్టర్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు ముతవరపు జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మరియు పిఓకి మెమోరాండం ఇచ్చిన గోడ్వానా సంక్షేమ పరిషత్
RELATED ARTICLES