Friday, July 4, 2025

గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘంరాష్ట్ర అధ్యక్షులు రామావజ్జలకు జన్మదినశుభాకాంక్ష లుతెలిపిన బ్రాహ్మణ సంఘాలు

స్టేట్ న్యూస్ తెలుగు, 27 జూన్ (భద్రాచలం ):

భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులుగా గత 35 ఏళ్లుగా ఎన్నికవుతూ పురోహితుల గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, 2003 డిసెంబర్లో హైదరాబాదులో నిర్వహించిన బ్రాహ్మ గర్జన విజయవంతం కావడంలో ప్రధాన పాత్ర పోషించి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పెద్ద ఎత్తున బ్రాహ్మణులను బ్రహ్మగర్జనకు తరలించుటలో ప్రధాన పాత్ర పోషించిన రామా వజ్జల. రవికుమార్ శర్మ జన్మదినోత్సవం శనివారం జరుగుతున్న సందర్భంగా హార్దిక జన్మదినశుభాకాంక్షలు ల్తెలియజేస్తున్నట్లు బ్రాహ్మణ సంఘాల ప్రముఖులు పాలకుర్తి .వెంకటరమణ శర్మ, కెవిఎస్ శర్మ, కలకోట శ్రీనివాసాచార్యులు, బి. పవన్ కుమార్ శర్మ,బలగం శివప్రసాద్, పురాణం. రామప్ప శాస్త్రి, ఎం. వి శ్రీనివాస్, సతీష్ కుమార్ శర్మ, సిరిపురపు.అశోక్ కుమార్ శర్మ,ప్రతాపురం. నరసింహాచార్యులు, మట్టపల్లి. మల్లికార్జున్ శర్మ, కోవూరు. సుందర రామ శాస్త్రి,కంజర్ల. విజయ్ కుమార్, ఆర్. వి. శ్రీనివాస్ శర్మ, భాస్కరుని. సత్యప్రసాద్, కౌతా. ప్రసాద్ , ఎం. వేణు, బొల్లికుంట. శ్రీనివాస్. శేషాచార్యులు, ఎస్ భార్గవ్, కె.రఘురాం, కె.
జగన్నాధాచార్యులు. వీరభద్ర శర్మ, ఆరవెల్లి. జగన్,
ముకుందల. సత్యనారాయణ శాస్త్రి, ఆర్ నగేష్ తదితరులు తెలియజేశారు.

వేల ఎకరాల ఆస్తులు ఉన్న శ్రీ అంబాసత్రం & ఇతర దేవస్థానంలకు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా నిజాయితీగా బాధ్యతలు నిర్వహించి, దేవాలయ ఆస్తులు రక్షించి బాలా త్రిపుర సుందరి అమ్మవారి కృపతో బ్రాహ్మణ సమాజానికి సేవలు అందించి వారి అభిమానాన్ని రవికుమార్ పొందారని అన్నారు.

సంఘ సభ్యుల అభిమానంతో సభ్యులచే షష్టి పూర్తి మహోత్సవం జరిపించుకున్న గౌరవం రవి కుమార్.శర్మ గారికే దక్కిందన్నారు.వివిధ రాష్ట్రాలలో తుఫాన్లు. భూకం పాలు, వరదలు సంభవించినప్పుడు బాధితులకు సంఘ పరంగా సహాయం అందించడంలో చొరవ చూపించే వారని,
తమ పెద్దలు చూపిన దారిలో పయనిస్తూ, కార్తీక వన మహోత్సవాలు, లోక కళ్యాణం కోసం వరుణ యాగాలు, సహస్ర కలశాభిషేకాలు, సంఘ పరంగా నిర్వహిస్తూ,
జగద్గురు ఆదిశంకరాచార్య,రామానుజాచార్య స్వామి వార్ల జయంతులు,

భారత అభివృద్ధి ప్రదాత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివీ నరసింహారావుగారి మరియుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతులు, వర్ధన్తులు నేటికీ నిర్వహిస్తు, వారిపై తన అభిమానాన్ని చాటుకుంటున్నారని,
పౌరోహిత సంఘ అధ్యక్షులుగా ఉంటూ సాటివారికి సహాయం అందిస్తూ తన వృత్తిని గౌరవిస్తూ తన వృత్తికి తగ్గట్లుగా సర్వేజనా సుఖినోభవంతు అనే విధంగా పయనిస్తూ, చట్టసభలలో తమ సమాజానికి కూడా అవకాశాలు ఇవ్వాలని ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ ఖమ్మం అసెంబ్లీనుండి(బ్రాహ్మణ) స్వతంత్ర అభ్యర్థిగా
పోటీ చేశారని,గత తొమ్మిది 9 సంవత్సరాలుగా నభూతో న భవిష్యతి అనే విధంగా పురోహితులుఅందరూ కలసి పంచుకునే విధంగా తన ఆధ్వర్యంలో భద్రాద్రి లోఆల్ రౌండ్ జాయింట్ నిర్వహిస్తుబ్రాహ్మణ సంఘాలవారిచే శహభాష్ అనిపించుకుంటున్న,గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ, రామా వజ్జల రవికుమార్ శర్మ కు
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు, తెలియజేస్తూ శ్రీ మహాగణాధిపతి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శుభాశీస్సులతో ఇంకా మరెన్నో జన్మ దినోత్సవాలు జరుపుకోవాలని భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular