దానిమ్మ పండు వలన ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అన్న సంగతి చాలా మందికి అవగాహన లేదు. దానిమ్మను మనం తీసుకునే ఆహారంలో తరుచూ తీసుకుంటే ఎన్నో ఆనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.రుచిలో కూడా ఎంతో బాగుండే దానిమ్మ పండు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా రారాజే. దానిమ్మలో మినరల్‌తోపాటు పీచూ, పొటాషియం, క్యాల్షియం లాంటివి. తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మలోని పోషకాలు గుండె సమస్యలు, రక్తపోటు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుందంటారు. దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటరాగేటివ్ హెల్త్ (NCCIH)లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, దానిమ్మ పండులో అనేక పోషకాలు ఉంటాయి అని తెలిపింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటంవలన దానిమ్మ తీసుకుంటే గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు నయమవుతాయని కూడ వెల్లడించింది.
దానిమ్మలో విటమిన్ కె విటమిన్ ఉండటం వలన రక్తం గడ్డకట్టకుండా మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం వలన దానిమ్మ రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదు.క్రమం తప్పకుండ దానిమ్మ రసం తీసుకోడవం వలన హార్ట్ బ్లాక్స్ కూడా నయమవుతాయి అని అంటారు.ఎదియేమైనప్పటికీ ఎంతో రుచిగా ఉంటూ ఇన్ని ప్రయోజనాలు ఉన్న దానిమ్మని తినడానికి ఇక ఆలస్యం ఎందుకు.
గమనిక: ఈ ఐటమ్ కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా మీ వైద్యులను సంప్రదించండి.