స్టేట్ న్యూస్ తెలుగు , 18 ఫిబ్రవరి (నేలకొండపల్లి / ఖమ్మం)
నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీలో నూతన గ్రంథాలయ నిర్మాణం శిధిలావస్థలో ఉన్నది, నేలకొండపల్లి టౌన్ లో ప్రస్తుతం గ్రంథాలయం స్థానిక ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు ఎంతోమంది పాఠకులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధపడేవాళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నిత్యం గ్రంథాలయం కు వస్తూ ఉంటారు. నూతన గ్రంథాలయ భవనం లేక విద్యార్థుల ప్రిపరేషన్ కొరకు ఖమ్మం జిల్లా ప్రధాన గ్రంథాలయం పై ఆధారపడుతున్నారు. అలాగే, గత సంవత్సరం మంత్రులు ఎమ్మెల్యే, స్థానిక నాయకుల సమక్షంలో శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కాంట్రాక్టర్ మధ్యలో ఆరు నెలల లోపులో గ్రంథాలయ భవన సముదాయం పూర్తిచేయాలని తీర్మానం చేశారు. కానీ భవన నిర్మాణం ప్రాథమిక దశలోనే కుంటుపడిన పరిస్థితి ఏర్పడింది. కావున, అధికారులు నాయకులు సత్వరమే స్పందించి భవన నిర్మాణం పూర్తి చేయాలని గ్రంథాలయ పాఠకలు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.