స్టేట్ న్యూస్ తెలుగు, 30నవంబర్(పవన్ :మహబూబాబాద్) : మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన వంటి కొమ్ము అంకిత్ రెడ్డి టీజీపీ ఎస్సీ ప్రకటించిన ఫుడ్ సెక్యురిటీ ఫలితాల్లో సత్తాచాటారు. 2022 నవంబర్లో రాత పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు . వంటికొమ్ము అప్పారెడ్డి , నిర్మల దంపతుల కుమారుడు అంకిత్ రెడ్డి 2012 లో వరంగల్ ఎన్ ఐటీలో బీటెక్ పూర్తి చేశారు . పట్టభద్రుడైన తర్వాత రూరల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు . కోల్ ఇండి యాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించి నాగపుర్లో రెండేళ్ల పాటు పనిచేశారు . ఇటీవల వెలువడిన ఆహార భద్రత అధికారి ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించి తన సత్తాచాటుకున్నాడు . తల్లిదండ్రులు , సతీమణి ప్రోత్సాహంతోనే కొలువు పొంది నట్లు తెలిపారు .
ఫుడ్ సెక్యురిటీ ఫలితాల్లో సత్తా చాటిన వంటికొమ్ను అంకిరెడ్డి
RELATED ARTICLES