స్టేట్ న్యూస్ తెలుగు,02 ఆగస్టు (ఖమ్మం)
ఖమ్మం జిల్లాలో ప్రముఖ హాస్పిటల్ స్తంభాద్రి హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంభందించి 2డి ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును. అంతే కాదు ఆర్దో, న్యూరో, యూరాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ పరీక్షలు కూడా నిరహిస్తారని, అలాగే వీటికి సంబంధించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని CPM పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ మరియు బోడేపూడి విజ్ఞాన కేంద్రం (BVK),CPM పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్,బివికె ట్రస్ట్ చైర్మన్ వై.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఖమ్మం NST రోడ్ మంచికంటి పంక్షన్ హల్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్య్రమంలో ప్రముఖ డాక్టర్లు మేదరమేట్ల అనిల్ కుమార్, పేర్ల హర్షతేజ, గుమ్మడి రాఘవేంద్ర, గట్టినేని సురేష్, డోగిపర్తి కృష్ణ సుమంత్ మరియు రెగ్యులర్ ప్రముఖ డాక్టర్లు చీకటి భారవి , కొల్లి అనుదీప్ , రావెళ్ళ రంజిత్, పిల్లలమర్రి సుబ్బారావు, గుడిపూడి రాజేష్, జెట్ల రంగారావు పాల్గొంటారు.
నెల నెలా రెగ్యులర్ గా జరిగే మెడికల్ భాగంగా ఈ నెల లో యధావిధిగా షుగర్, బిపి, పక్షవాతం తదితర ఆరోగ్య సమస్యలకు నెలకు సరిపడా మందులు ఇవ్వడంతో పాటు ప్రతి నెలా కంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు.అలాగే చెవి, ముక్కు, గొంతు డాక్టర్ కూడా అందుబాటులో వుంటారు.అవకాశం వున్నవారు షుగర్ టెస్ట్ బయట చేయించుకొని వస్తే వెంటనే మందులు తీసుకొని వెళ్ళవచ్చు.అవకాశం లేనివారు ఉదయం 6 లోపు వెంటనే వచ్చి మెడికల్ క్యాంపు లో టెస్ట్ లు చేయించుకోవచ్చు. ఈ మెడికల్ క్యాంప్ లో టిఫిన్ సౌకర్యం కూడా ఉచితం అని నిర్వాహకులు తెలిపారు.ఖమ్మం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా నిరాఘాటంగా, ఉచితంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.