Friday, July 4, 2025

బాణసంచా దుకాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి: పోలీస్ కమిషనర్

స్టేట్ న్యూస్ తెలుగు,15 అక్టోబర్ (ఖమ్మం)

ఖమ్మం జిల్లాలో బాణసంచా దుకాణాలు పెట్టుకోదలచిన వ్యాపారులు అక్టోబర్ 25 తేది సాయంత్రం లోపు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ, నగర పాలక శాఖ, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు, టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ధరఖాస్తుతో పాటు AE-5 ఫామ్, సెల్ఫ్ అఫిడవిట్ , చలానా రిసీప్ట్,. ఆధార్ కార్డ్ , ఫోటో జతపరచి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలి.

అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా విక్రయదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular