బాధిత కుటుంబాలకు ప్రభుత్యం అండగా ఉండాలి!..గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ
స్టేట్ న్యూస్ తెలుగు,12 అక్టోబర్ (భద్రాచలం)
చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గట్టుపల్లి జంపు వయసు26,సోయం మహేందర్ 18 సంవత్సరాలు వుంజిపల్లి ఆశ్రమ పాఠశాలలోపదోతరగతి చదువుతున్న
విద్యార్దులు ఈరోజు శనివారం ఉదయం సద్దుల బతుకమ్మ నిమగ్న వేడుకల్లో మృతి తో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ ఘాట్ ప్రదేశాల లో ప్రమాద హెచ్చరికల బోర్డులు లేకపోవడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం అని గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఒక ప్రకటన లో ఆరోపించారు. యుక్త వయసులో చనిపోయిన ఆదివాసీ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఐటీడీఏ పీవో అధికారులకు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం మూలంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది అని ఆరోపించారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ అండగా నిలవాలని, నష్టపరిహారం చెల్లించాలని , నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పాయం డిమాండ్ చేశారు.