స్టేట్ న్యూస్ తెలుగు,11 ఆగస్టు(భద్రాచలం)
దుమ్ముగూడెం మండలం కొత్త పల్లి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కుంజా దీపక్ అనే ఆదివాసి విద్యార్థి శనివారం ఆశ్రమ పాఠశాల నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కిన సందర్భంగా తునికి చెరువు దగ్గర ఆటో యాక్సిడెంట్ లో మృతి చెందిన స్థానిక పాఠశాల ఉద్యులు పట్టించుకోలేదని GSP ఆరోపించింది. పాఠశాలలో హెచ్ఎం, వార్డెన్, డిప్యూటీ వార్డెన్, నైట్ వాచ్మెన్ లు ఉన్నారా లేరా అని విషయంపై ఐటీడీఏ పీవో విచారణ చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు.ఏజెన్సీలో నడుస్తున్న ఐ టి డి ఏ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఏకలవ్య పాఠశాలలో పర్యవేక్షణ కొరవడిందని, ఆదివాసి సంఘాలు, విద్యార్థి సంఘాలకు అనుమతి లేదు అని బోర్డులు పెట్టిన ఐటీడీఏ అధికారులు
విద్యార్థులపై పర్యవేక్షణ ఎందుకు సక్రమంగా నిర్వహించడం లేదని తీవ్రంగా విమర్శించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఐటిడిఏ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.