విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డా.కోట రాంబాబు
స్టేట్ న్యూస్ తెలుగు, 18 సెప్టెంబర్ (ఖమ్మం):మధిర లోని బంజారా కాలనీ నందు "శ్రీ సిద్ధి గణపతి యూత్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు
స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరారు.

అనంతరం "కోరంపల్లి చంటి" ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.కోట రాంబాబు
స్థానిక నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగా హనుమంతరావు, నిడమనూరు వంశీ, యన్నం కోటేశ్వరరావు, యర్రగుంట రమేష్, బిట్ర ఉద్దండయ్య, కంచర్ల అనిల్, సంపటి శివ, తోట గోపి, చేరుకుమల్లి వంశీ, అల్లాడి గోపి, వాకదని నాగేశ్వరావు, సంపసాల గోపి, మూడ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.