*స్టేట్ న్యూస్ తెలుగు*
మొహర్రం పండగ రోజు కాదు…. శుభాకాంక్షలు చెప్పకూడదు.ఎందుకంటే మొహర్రం రోజును అమరవీరుల వర్ధంతిగా జరుపుకుంటారు. తెలంగాణలో పలు ప్రాంతాలలో ఈ రోజు పీర్ల పండుగ రూపంలో జరుపుకుంటారు.ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రంగా పిలుస్తారు. ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు.మొహర్రం మాసంలో మొదటి రోజున ఇరాక్ లోని కర్బలా మైదానంలోయుద్ధం ప్రారంభమైంది.శత్రు సైన్యం …మొహర్రం నెల పదో రోజున సాయంత్రం అల్లా్హ్ ను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమాం హుసేన్ ను చుట్టుముట్టారు. అప్పుడు శత్రువుల చేతిలో దాదాపు 70 మంది వరకు మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులుగా మారిపోయారు.అందుకే ఈ రోజు శుభకాంక్షలు చెప్పరు.