స్టేట్ న్యూస్ తెలుగు,18 డిసెంబర్(ఖమ్మం): ప్రభుత్వ ఆదేశాలననుసరించి జిల్లాలో ఈ నెలలో వాసెక్టమీ (కోత కుట్టు లేని )కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ బి మాలతి తెలిపారు. వాసెక్టమీ శాస్త్ర చికిత్సలు పక్షోత్సవాల సందర్బంగా ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో వైద్యధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ లో పురుషులు భాగస్వామ్యన్ని ప్రోత్సాహస్తూ వేసేక్టమీ ఆపరేషన్ లు చేయించాలని, జిల్లా ఆసుపత్రి కీ పంపించాలని ఆమె చెప్పారు ప్రోత్సహించిన వారికి రూ 200/లు మరియు వేసేక్టమీ చేయించు కొన్న వారికి రూ 1100/లు ప్రోత్సాకంగా ఇస్తారని చెప్పారు. మన సిబ్బంది తో వేసేక్టమీ (కోత కుట్టు లేని )ఆపరేషన్ ల గురించి అవగాహనా కల్పించి, వారిని మోటివేషన్ చేయాలని కోరారు. అలాగే జిల్లా ఆసుపత్రి నందు ఏ రోజు చేస్తారో ప్రజలకు వివరించాలని చెప్పారు.ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ బి సైదులు మాట్లాడుతూ. మాతా శిశు సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని, డెంగీ శాంపిల్ ను ఎక్కువగా చేయాలని, నివారణ కార్యక్రమాలు చేసి డెంగీ కేసులు పెరగకుండా చూడాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డెమో సాంబశివరెడ్డి, డి ఎస్ ఓ వేణు, హరికృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు