Friday, July 4, 2025

అథ్లెటిక్స్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారిణిని అభినందించిన జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, బాడీ బిల్డింగ్ అసోసియేషన్

స్టేట్ న్యూస్ తెలుగు,09 అక్టోబర్ (భద్రాచలం): హనుమకొండ లో జరిగిన తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 16 విభాగంలో భద్రాచలం కు చెందిన షైక్ అమ్రీన్ షాట్ పుట్ లో 9.43 మీటర్లు బంగారు పతకం సాధించింది.అండర్ 16 విభాగంలో జావలిన్ త్రో విభాగంలో 35.00 మీటర్లు వేసి కాంస్య పతకం సాధించింది.ఈ పథకాలు సాధించిన ఎస్కే అమ్రీన్ ను భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు టి వసంతరావు (సీనియర్ ప్రముఖ న్యాయవాది) అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎస్ కే అమ్రీన్ గతంలో కూడా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ఎన్నో పతకాలను సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తూ కూడా తన కూతురులో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన షైక్ మస్తాన్ ను కూడా అభినందించారు.జిల్లాలో వున్నా ప్రతిఒక్కరు తమ కూతర్లను కొడుకుతో సమానంగా పెంచి, వాళ్లలో ఆటలు యందు ప్రవీణ్యం కనపరిస్తే, ప్రతి తండ్రి కూడా షైక్ మస్తాన్ లాగా ప్రోత్సహించాలి అని గుర్తు చేసారు.భద్రాచలం లో పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయి లో రాణిస్తున్న గొంగడి త్రిషను వాళ్ళ నాన్న గారు జీవీ రామిరెడ్డి ఎలా తీర్చిదిద్దారో ఈ సందర్బంగా గుర్తు చేసారు.
ఈ కార్యక్రమంలోపవర్ లిఫ్టింగ్ జిల్లా అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి, ( సిటీ స్టైల్ జిమ్ కోచ్ భద్రాచలం) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ( జీవన్ హాస్పిటల్) కోశాధికారి మహంతి వెంకట కృష్ణాజి ( సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టర్) జిల్లా బాడీ బిల్డింగ్ అధ్యక్షులు టి వసంతరావు ( ప్రముఖ సీనియర్ న్యాయవాది) ఎస్.కె మస్తాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular