స్టేట్ న్యూస్ తెలుగు,08 నవంబర్ (భద్రాచలం)
శుక్రవారం నాడు భద్రాచలం ఐటిడిఏ లీగల్ సెల్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోంది వీరయ్య మాట్లాడుతూ., భద్రాచలం ఏజెన్సీలో స్థానిక ఆదిమ జాతుల కోసం ఒక న్యాయ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
భద్రాచలం న్యాయ కళాశాల ను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో స్థానిక ఎస్టీలు స్థానిక ఎస్సీలు స్థానిక బీసీ ఓబీసీలు విద్యా రంగంలో ముఖ్యంగా న్యాయ శాస్త్రంలో రాణించవచ్చని, ఏజెన్సీలో విద్యార్థులను న్యాయ శాస్త్రంలో శిక్షణ ఇప్పిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని డాక్టర్ అంబేద్కర్ వారసులను తయారు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పరిసిక సోమరాజు, కొర్సా కృష్ణార్జున రావు లాయర్ పాల్గొన్నారు.