స్టేట్ న్యూస్ తెలుగు,27 జూలై (ఖమ్మం)
ప్రభుత్వ ఆదేశానుసారము ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం భారతదేశ మాజీ రాష్ట్రపతి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా భారత దేశమంతటా సి.పి.ఆర్ . వర్క్ షాపు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి . మాలతి ఆధ్వర్యంలో సి.పి.ఆర్ వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ సుబ్బారావు డి.టి.సి.ఓ. ఎన్.సి.డి. ప్రోగ్రాం ఆఫీసర్ అధ్యక్షత వహించారు . ఈ వర్క్ షాప్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది . ఉద్యోగులందరినీ సి.పి.ఆర్ . పై రాష్ట్ర శిక్షకుడు డాక్టర్ బాలకృష్ణ సి.పి.ఆర్ . శిక్షణ గురించివివరంగా తెలియజేశారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి . మాలతి మాట్లాడుతూ., సి.పి.ఆర్ అనేది మనిషికి ఆపద కాలములో ఆదుకునే పునర్జన్మ లాంటి సహకారం అని చెప్పారు .ఈ రోజులలో మనిషి యొక్క జీవన విధానము ఆహారపు అలవాట్లు జీవన శైలి అనేది కాలానుగుణంగా మారుతుందని , ప్రతి మనిషి తన జీవన శైలి లో మార్పు తెచ్చుకొని ఆరోగ్య పరిరక్షణ కొరకు వ్యాయామము , ఆహారపు అలవాట్లులో , ( జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం ) స్వచ్ఛమైన గాలి , నీరు తీసుకోవడం , 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి తమ యొక్క ఆరోగ్య ప్రొఫైల్ ను చెక్ అప్ చేసుకోవడం, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పని చేయటం లాంటి అలవాట్లు చేసుకుంటే గుండె సంబంధ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయని చెప్పారు .
ప్రతి ఉద్యోగి తమ పని వేళలో పని చేసుకుంటూ , మధ్యలో దొరికిన సమయాన్ని ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియ లో నిమగ్నం అవుతూ మెడిటేషన్ చేసుకుంటూ , ఉపరితిత్తుల సమస్య నుంచి దూరంగా ఉండాలని చెప్పారు .ప్రతి ఉద్యోగి సి.పి.ఆర్ . శిక్షణను నేర్చుకొని అనుకోకుండా సమయంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ సంఘటనలు ఎదురైనప్పుడు ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలన ఉపయోగించి వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడుతూ హాస్పిటల్ కు చేర్పించాలని సూచించారు .
ప్రతి ఉద్యోగి తమ ఇంటి దగ్గర గానీ , వచ్చిపోయే దారిలో కానీ , కార్యాలయ లో కానీ హార్ట్ ఎటాక్ సంఘటనలు ఎదురైనప్పుడు సి.పి.ఆర్ . లో నేర్చుకున్న విషయాలను ఉపయోగించి వారి యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు అని , ఈ వర్క్ షాప్ లో శిక్షణను క్షుణంగా నేర్చుకొని చెప్పిన విషయాలు అర్థం చేసుకొని ఆపద సమయంలో ఉపయోగించాలని కోరారు .డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ., ప్రపంచం మొత్తం మీద క్యాజువాలిటీ కేసులలో 1.5 మిలియన్ కేసులు సి.పి.ఆర్ . పై అవగాహన లేనందుకు తన ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు.అదేవిధంగా మన భారత దేశ జనాభాలో 98 % ప్రజలకు ఈ సి.పి.ఆర్ . టెక్నిక్ మీద అవగాహన లేనందున చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవటం జరుగుతుందని చెప్పారు . అందుకు భారత ప్రభుత్వము డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి రోజున భారత దేశమంతటిలో సి.పి.ఆర్ . కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించడం జరిగిందని చెప్పారు .గుండె సంబంధిత సమస్యలు ప్రతి వంద మందిలో దాదాపుగా 10 నుంచి 20 మందికి ఈ సమస్య రావటం జరుగుతుంది , కనుక సి.పి.ఆర్ . టెక్నిక్ ద్వారా ప్రతి మనిషినీ ఈ సమస్య నుంచి పునర్జన్మ కల్పించడం జరుగుతుందని సూచించారు .
శిక్షకుడు డాక్టర్ బాలకృష్ణ సిబ్బంది అందర్నీ ప్రత్యక్షంగా మ్యాని క్వీన్ నీ ఉపయోగించి సి.పి.ఆర్ , ఎలా చేయాలో నేర్పించారు .రెండు నిమిషాల్లో ఐదు షేట్లు , ఒక్కొక్క షేటుకు 30 సార్లు చాతి మీద రెండు చేతులతో కంప్రెషన్ ఇస్తూ మనిషి నాడీ వ్యవస్థ , శ్వాస రేటును గమనిస్తూ శ్వాస తీసుకునేంతవరకు ఈ సి.పి.ఆర్ . టెక్నిక్ ఉపయోగించి మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు అని తెలియజేసారు.
సి.పి.ఆర్ . వర్క్ షాప్ లో ఖమ్మం వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు అందరు పాల్గొని వరుస క్రమంలో ఈ శిక్షణను నేర్చుకున్నందుకు , శ్రద్ధగా విన్నందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి . మాలతి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఆపద కాలంలో ఇరుగుపొరుగు వాళ్లను కానీ , తమ ఇంట్లో కానీ , సి.పి.ఆర్ . టెక్నిక్ ద్వారా మనిషికి పునర్జన్మ కల్పించాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేశారు
ఈ వర్క్ షాప్ కార్యక్రమంలో డాక్టర్ శిరీష అడిషనల్ డి.ఎం.ఎచ్.ఓ. , డాక్టర్ సైదులు డిప్యూటీ డి.ఎం.ఎచ్.ఓ. , డాక్టర్ రామారావు ప్రోగ్రాం ఆఫీసర్ , డాక్టర్ భాస్కర్ ప్రోగ్రాం ఆఫీసర్ , డాక్టర్ రమణ ప్రోగ్రామ్ ఆఫీసర్ , డాక్టర్ మోతియా , ప్రోగ్రాం ఆఫీసర్ , కాశీనాథ్ డెమో మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఈ వర్క్ షాప్ ను విజయవంతం చేశారు.