ఎక్కడైనా కోడి పందెలు నిర్వహిస్తే డయల్ 100 లేదా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ :8712659123 తెలియజేయండి!..పోలీస్ కమిషనర్ సునీల్ దత్
స్టేట్ న్యూస్ తెలుగు,13 జనవరి(ఖమ్మం): జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.. సంక్రాంతి పండుగను సిరిసంపదలతో కనువిందుగా, కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని అకాంక్షించారు.
అదేవిధంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా కోడి పందెలు నిర్వహిస్తే డయల్ 100 లేదా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ :8712659123 స్ధానిక ఏసీపీలకు సమాచారం తెలియజేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ACP Task force: 8712659180
ACP Khammam: 8712659105
ACP Kallur : 8712659166
ACP Wyra :8712659146
ACP Kmm rural:8712659124
*ప్రజా ప్రభుత్వంలో ప్రజారంజక బడ్జెట్*
*== ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి అభినందనలు*
*== హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు పెండ్ర అంజయ్య*
కూసుమంచి: ప్రజా ప్రభుత్వంగా ప్రజాదారణ పొందుతున్న తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రజాపరిపాలన పరమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, ఈ బడ్జెట్ పట్ల ప్రజలందరు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య హర్షం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించిన అంజయ్య ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కాకుండా కాంట్రాక్టర్లకు మేలు చేసే విధానపరమైన బడ్జెట్ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటు పడేది ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా నిధులు కేటాయింపు జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను కచ్చితంగా అమలు చేసే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర మొదటి బడ్జెట్ ను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి అద్భుతమైన బడ్జెట్ ను రూపకల్పన చేశారని అన్నారు. రైతులను రాజులను చేయాలనే లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తంచేశారు. విద్యా, వైద్యం, మౌళిక వసతులకు ఎక్కువ నిధులను కేటాయించారని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఎక్కువ నిధులు కేటాయింపు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆర్థికశాఖ, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికి అభినందించాల్సింది పోయి ప్రతిపక్షపార్టీలు విమ్మర్శలు చేయడం సరైంది కాదన్నారు. వేల కోట్ల రూపాయలను అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత పాలనతో ఆదాయం వైపు తీసుకెళ్ళి, 2లక్షల91వేల159 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం సాధారణ విషయం కాదన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో బెస్ట్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.